Home News రెండు రాష్ట్రాల మధ్య జలయుద్ధం తప్పదా..ఈ దెబ్బతో గుట్టంతా బయటకి..!!

రెండు రాష్ట్రాల మధ్య జలయుద్ధం తప్పదా..ఈ దెబ్బతో గుట్టంతా బయటకి..!!

తెలంగాణ రాష్ట్రం విడిపోయాక మొదట్లో చంద్రబాబు తో కలిసిమెలసి ఉన్నా ఆ తర్వాత కేసీఆర్ కి బాబు కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి.. అయితే అలా మేము చేయబొమ్ తెలంగాణ రాష్ట్రంతో కలివిడిగా ఉంటాం అని జగన్ అధికారంలోకి రాగానే చెప్పిన మాట.. అయితే ప్రస్తుతం సీన్ వేరేగా ఉంది.. తమ రాష్ట్ర ప్రయోజనాలకోసం ఎంతదూరమైనా వెళ్తాము అని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఛాలెంజ్ చేసుకోవడంతో ఈ వివాదం ఎంతదూరం వెళ్తుందో అర్థం కానీ పరిస్థితి.. రాయలసీమ కి నీటిని పంపే విధంగా జగన్ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టగా ఆ విషయమై కేసీఆర్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు..

‘ఆంధ్రప్రదేశ్‌తో గొడవల్ని మేం కోరుకోలేదు. ఇరు రాష్ట్రాలూ కలిసి సంయుక్తంగా నీటి ప్రాజెక్టులు కట్టుకుని.. గోదావరి నుంచి వృధాగా సముద్రంలో కలిసిపోయే నీటిని ఒడిసిపట్టి, వాడుకుందామనుకున్నాం.. వైఎస్‌ జగన్‌ని ఇంటికి పిలిచి, భోజనం పెట్టి మరీ.. విషయాన్ని వివరించాను.. కానీ, ఇప్పుడిలా ఆంధ్రప్రదేశ్‌ అన్ని విషయాల్లోనూ మాకు అడ్డు తగులుతుందని అనుకోలేదు..’ అంటూ కేసీఆర్‌ గుస్సా అయ్యారు.శ్రీశౖలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల నుంచి నీటి వాడకంపై రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు రేగింది. నిజానికి, ఇది కొత్త తగాదా కాదు.. పాతదే. కాస్త కొత్తగా హైలైట్‌ అవుతోంది. కరోనా విషయంలో అటు తెలంగాణ.. ఇటు ఆంధ్రప్రదేశ్‌.. నానా రకాల విమర్శలూ ఎదుర్కొంటున్నాయి. ఇరు రాష్ట్రాల్లోని అధికార పార్టీలూ.. వివిధ అంశాల్లో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తోంది. దాన్నుంచి తప్పించుకోవడానికే, ఈ ‘జల యుద్ధం’ తెరపైకొచ్చినట్లు కన్పిస్తోంది.

లేకపోతే, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్‌కి అభ్యంతరాలున్నా, తెలంగాణ ముఖ్యమంత్రి పిలవగానే ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వైఎస్‌ జగన్‌ ఎలా వెళ్ళగలిగారు.? పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది మొదటి నుంచీ. ఆ విషయమై సమస్య పరిష్కారమయ్యిందా.? లేదా.? అన్న ప్రశ్నకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఎందుకు ఇప్పటిదాకా స్పష్టత ఇవ్వడంలేదు.? ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే వున్నాయి. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కి వైసీపీ తెరవెనుక సహకారం అందించింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి టీఆర్‌ఎస్‌ సహకరించింది. ఈ బంధం నిజంగానే చాలా బలమైనది. మరి, ఈ గిల్లికజ్జాలేంటి.? అంటారా.! అదే మరి, ‘డైవర్షన్‌ పాలిటిక్స్‌’ అంటే.! అన్నట్టు, ఏపీ నోరు మూయించేలా అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సమాధానం చెబుతామని అంటున్న కేసీఆర్.. మాట మీద నిలబడతారా.? తన విశ్వసనీయతను చాటుకుంటారా.? వేచి చూడాల్సిందే.

Must Read

ఈ ఎస్ ఐ కుంభ కోణానికి మించిన కుంభకోణంలో అచ్చెనాయుడు..?

ఇప్పటికే ఈఎస్ఐ స్కాం లో రెండు నెలలనుంచి రేమాండ్ ఉన్న మాజీ మంత్రి, టిడిపి ఎమెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు మరో కుంభకోణంలో నూ ప్రధాన నిందితుడుగా ఉన్నాడన్న వార్తలు టిడిపి లో ఇప్పుడు...

ఏపీలో ట్యాపింగ్ రగడ : ఎవరిదీ తప్పు.. ఎవరిదీ ఒప్పు.!!

ఏపీలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన వివాదం నడుస్తోంది. ఏపీలో రాజకీయనాయకులవే కాదు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి అనే వార్తలు వస్తున్నాయి. న్యాయమూర్తుల ఫోన్లనే ట్యాప్ చేస్తున్నారంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల...

వైసీపీ కి చెక్ పెట్టడానికి బ్రహ్మాస్త్రం రెడీ చేసిన చంద్రబాబు..!!

గత కొంత కాలంగా చంద్రబాబు ఏం చెప్పినా సరే దానికి వాల్యూ లేకుండా పోతుంది. ప్రజలు కూడా ఇక చంద్రబాబు ను పట్టించుకునే పోసిషన్ లో లేరు.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఆయనది...

శంకుస్థాపన వాయిదా వెనుక జగన్ పై వత్తిడి..అయన హస్తం ఉందా..!!

ఎపి సీఎం జగన్ ఏరి కోరి తెచ్చుకున్న విశాఖ రాజధాని శంకుస్తాపన కార్యక్రమం వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.. అయితే ఎందుకు ఎలా వాయిదా పడిందన్న సంగతి మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు.....

ఎన్టీఆర్ చంద్రబాబు రేంజ్ లో పవన్ కి వెన్నుపోటు.. ఎవరంటే..!!

ఏపీ రాజకీయాల్లో జనసేన పానకంలో పుడకలా మిగిలిపోయింది అన్నవారికి పవన్ కళ్యాణ్ బిజెపి లో చేరి గట్టి షాక్ ఇచ్చాడు.. ఇక బీజేపీ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వెనుకాల పవన్ హస్తం ఉందన్న...