Home Cinema తెలుగు హీరోలకు సోను సూద్ బుద్ధి చెప్తున్నాడా..ఎల్లలు దాటుతున్న ఔదార్యం..!!

తెలుగు హీరోలకు సోను సూద్ బుద్ధి చెప్తున్నాడా..ఎల్లలు దాటుతున్న ఔదార్యం..!!

దేశంలో హీరోల్లో , నటుల్లో సోషల్ సర్వీస్ చేయాలన్న తపన కొంత మందికి మాత్రమే ఉంటుంది. ఇప్పటివరకు చాలామంది నటులు తమకు తోచిన విధంగా ఎంతో కొంత సహాయం చేసి ప్రజలను ఆడుకున్నవారే, ఇక ఈ కరోనా సమయంలో ప్రజలకు సహాయం చేయడానికి హీరోలు ఎవరు కూడా ముందుకు రాలేదనే చెప్పాలి.. కరోనా తో ప్రజలు ఇబ్బంది పడుతుంటే చాలామంది లాక్ డౌన్ టైం ఛాలెంజ్ లతో కాలం గడిపేశాడు.. టాలీవుడ్ విషయానికొస్తే విజయ్ దేవరకొండ మిడిల్ క్లాస్ పేరిట పేద ప్రజలకు కొంత ఆర్థిక సాయం చేసే దిశగా వెళ్లారు.. ఆ కార్యక్రమానికి విరాళాలు తక్కువ రాగ, అప్లికేషన్స్ మాత్రం బాగానే వచ్చాయి.. అయితే విజయ్ చేసిన ఆ పనికి అంతటా మంచి పేరే వచ్చింది. ప్రజలు కూడా విజయ్ చేసిన మంచి ని గుర్తుపెట్టుకుంటామన్నారు.

ఇక సోను సూద్ అయితే ఈ కరోనా విపత్తులో ప్రజలను కన్నబిడ్డలవలె ఆడుకుంటున్నారని చెప్పొచ్చు.. లాక్ డౌన్ కాలంలో… కొన్ని వేల మంది వలస కూలీల్ని.. విద్యార్థుల్ని సొంత ఖర్చులతో.. బస్సులు.. రైళ్లు.. విమానాలను ఏర్పాటు చేసి.. స్వస్థలాలకు పంపారు సోనూసూద్. చివరికి కిర్గిస్తాన్‌లో ఇరుక్కున్న విద్యార్థుల్ని కూడా ప్రత్యేక విమానం ఏర్పాటు చేయించి.. రప్పించారు. ముంబైలో తనకు ఉన్న హోటల్‌ను క్వారంటైన్ కేంద్రానికి ఇచ్చేశారు. ఆయన దాతృత్వం చూసి.. చాలా మంది ఈర్ష్యపడ్డారు. ఆయనకు వస్తున్న ఆదరణ చూసి.. శివసేన నేతలు కూడా.. రాజకీయం అని ఆరోపణలు చేశారు. అయినా సోనూసూద్ .. ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అందర్నీ మంచి చేసుకుంటూ వెళ్లి.. అందరికీ మంచి చేస్తూ పోతున్నారు. కేవలం.. లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న వారికే కాక… ఇతర సమస్యలతో.. తన దృష్టికి వస్తున్న సోషల్ మీడియా పోస్టులపై స్పందిస్తున్నారు…

తాజాగా చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన రైతు కుటుంబ కష్టాలను క్రిష్ణమూర్తి అనే వ్యక్తి.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది అన్ని రకాల సోషల్ మీడియాల్లోనూ వైరల్ అయింది. కానీ.. అటు ప్రభుత్వ వర్గాల నుంచి కానీ.. ఇటు సినీ వర్గాల నుంచి కనీసపాటి స్పందన రాలేదు. ఎక్కడో ముంబైలో ఉంటూ… ఎలాంటి సంబంధం లేదని.. సోనూ సూద్ మాత్రం స్పందించారు. ఏకంగా ట్రాక్టరే పంపిస్తానని.. ఆ పిల్లలు ఇద్దరూ చదువుకోవచ్చని.. సూచించారు. లాక్ డౌన్ కాలంలో.. కానీ ఆ తర్వాత కానీ… తెలుగు సినీ స్టార్లు.. ఎవర్నీ ఆదుకున్న పాపాన పోలేదు. ప్రభుత్వాలకు కొంత మొత్తం విరాళం ప్రకటించారు. సినీ ఇండస్ట్రీలో వారికి నిత్యావసరాలు ఇస్తామంటూ కొంత హడావుడి చేశారు. విజయ్ దేవరకొండ లాంటి వాళ్లు.. సామాన్యులకు సాయం చేస్తామంటే.. కొంత మంది రాళ్లేశారు. దాంతో.. ఎవరూ.. ముందుకు రాలేదు. ఒక్క వలస కూలీకి సాయం చేయలేదు. ఇప్పుడు సోనూసూద్‌ అందర్నీ.. తలదించుకునేలా చేశారు. ఎందుకంటే.. ఎంతగా వద్దనుకున్నా… తెలుగురైతుకు వచ్చిన కష్టానికి.. సోనూసూద్ స్పందించారు కానీ.. మన స్టార్లు మాత్రం స్పందించలేదనే… పోలిక సహజంగానే వస్తుంది మరి…

Must Read

ఈ ఎస్ ఐ కుంభ కోణానికి మించిన కుంభకోణంలో అచ్చెనాయుడు..?

ఇప్పటికే ఈఎస్ఐ స్కాం లో రెండు నెలలనుంచి రేమాండ్ ఉన్న మాజీ మంత్రి, టిడిపి ఎమెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు మరో కుంభకోణంలో నూ ప్రధాన నిందితుడుగా ఉన్నాడన్న వార్తలు టిడిపి లో ఇప్పుడు...

ఏపీలో ట్యాపింగ్ రగడ : ఎవరిదీ తప్పు.. ఎవరిదీ ఒప్పు.!!

ఏపీలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన వివాదం నడుస్తోంది. ఏపీలో రాజకీయనాయకులవే కాదు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి అనే వార్తలు వస్తున్నాయి. న్యాయమూర్తుల ఫోన్లనే ట్యాప్ చేస్తున్నారంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల...

వైసీపీ కి చెక్ పెట్టడానికి బ్రహ్మాస్త్రం రెడీ చేసిన చంద్రబాబు..!!

గత కొంత కాలంగా చంద్రబాబు ఏం చెప్పినా సరే దానికి వాల్యూ లేకుండా పోతుంది. ప్రజలు కూడా ఇక చంద్రబాబు ను పట్టించుకునే పోసిషన్ లో లేరు.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఆయనది...

శంకుస్థాపన వాయిదా వెనుక జగన్ పై వత్తిడి..అయన హస్తం ఉందా..!!

ఎపి సీఎం జగన్ ఏరి కోరి తెచ్చుకున్న విశాఖ రాజధాని శంకుస్తాపన కార్యక్రమం వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.. అయితే ఎందుకు ఎలా వాయిదా పడిందన్న సంగతి మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు.....

ఎన్టీఆర్ చంద్రబాబు రేంజ్ లో పవన్ కి వెన్నుపోటు.. ఎవరంటే..!!

ఏపీ రాజకీయాల్లో జనసేన పానకంలో పుడకలా మిగిలిపోయింది అన్నవారికి పవన్ కళ్యాణ్ బిజెపి లో చేరి గట్టి షాక్ ఇచ్చాడు.. ఇక బీజేపీ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వెనుకాల పవన్ హస్తం ఉందన్న...