Home News ఉన్నది ఉన్నట్లు చెబితే కేసీఆర్ కు పోయేదేముంది. ఎందుకంత కంగారు..!!

ఉన్నది ఉన్నట్లు చెబితే కేసీఆర్ కు పోయేదేముంది. ఎందుకంత కంగారు..!!

తెలంగాణ సీఎం కేసీఆర్ పరిస్థితి కరోనా కారణంగా కొంత దిగజారిపోయింది చెప్పాలి.. ఎందుకంటే సింహం లాంటి కేసీఆర్ ముందు పిల్లిలా ఉండే ప్రతిపక్షాలు ఇప్పుడు నోరు తెరుస్తున్నాయి.. అసలు రాజకీయానికి అంశమే లేదన్నట్లు కరోనా ని రాజకీయం చేస్తూ ప్రతిపక్షాలు అధికార పార్టీ పై దుమ్మెత్తి పోస్తున్నాయి.. ఇక ఇన్నో రోజులు మొహం తెలియని నాయకులూ కూడా ఇప్పుడు లైం లైట్ లోకి వచ్చి కేసీఆర్ ని విమర్శిస్తున్నారు. దీనికి తోడు సచివాలయ కూల్చివేత పనులు కూడా వారికి ఒక ఆయుధమై కేసీఆర్ ని మరింత విమర్శల పలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.. ఇప్పటికే గ్రేట‌ర్ హైద‌రాబాద్ స‌హా జిల్లాలు కూడా క‌రోనా కోర‌ల్లో చిక్కి అల్లాడుతున్నాయి. దేశంలో ప్ర‌ధాన క‌రోనా హాట‌స్పాట్‌లుగా మారిన నాలుగు రాష్ట్రాల్లోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో హైద‌రాబాద్ కూడా చేరిపోయింది. ఢిల్లీ, ముంబై, అహ్మ‌దాబాద్‌ల త‌ర్వాత స్థానంలో హైద‌రాబాద్ ఉండ‌డం గ‌మ‌నార్హం.దీంతో హైకోర్టు స‌హా రాజ‌కీయ ప‌క్షాలు క‌రోనా విష‌యంలో కేసీఆర్ ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, ప్ర‌జ‌ల ప్రాణాల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని, క‌రోనాను నిలువ‌రించే క్ర‌మంలో ఆయ‌న చేతులు ఎత్తేశార‌ని ఇలా అనేక ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.

హైకోర్టు అయితే, చాలా సీరియ‌స్ కూడా అవుతోంది. అయిన‌ప్ప‌టికీ.. కేసీఆర్ పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. వాస్త‌వ ప‌రిస్థితుల‌కు భిన్నంగా కేసీఆర్ ప్ర‌భుత్వం క‌రోనా విష‌యంలో లెక్క‌లు చూపిస్తోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. కొన్నాళ్ల కింద‌ట అంటే.. క‌రోనా తీవ్రత ఓమాదిరిగా ఉన్న స‌మ‌యంలో క‌రోనా లెక్క‌ల‌ను ఖ‌చ్చితంగా వెలువ‌రించిన ప్ర‌భుత్వం దీనిని గ‌ర్వంగా కూడా చెప్పుకొంది. అయితే, రాను రాను కేసుల సంఖ్య పెరుగుతుండ‌డంతో కేసీఆర్ స‌ర్కారు వ్యూహాత్మ‌కంగా ప‌రీక్ష‌ల‌ను నిలిపి వేసింది. “అంద‌రికీ ప‌రీక్ష‌లు చేయాల్సి అవ‌స‌రం లేదు“ అంటూ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద‌ర్ ప్ర‌క‌టించారు. దీంతో ప‌రీక్ష‌లు నిలిపివేశారు. అయితే, క‌రోనా తీవ్రత మాత్రం త‌గ్గుముఖం ప‌ట్ట‌లేదు. పైగా మృతుల సంఖ్య పెరుగుతూ వెళ్లింది. ఈ ప‌రిణామంపై హైకోర్టు సీరియ‌స్ అయింది. మృతుల సంఖ్య పెర‌గ‌డం వెనుక మ‌త‌ల‌బు ఏంట‌ని నిల‌దీసింది. ప‌రీక్ష‌లు పెంచాల‌ని సూచించింది. దీంతో ప‌రీక్ష‌లు పెంచారు. దీంతో మ‌ళ్లీ మృతుల సంఖ్య‌, ప‌రీక్ష‌ల సంఖ్య పాజిటివ్‌ల సంఖ్య కూడా పెరుగుతూ పోయింది.

ఇక‌, ఇప్పుడు అనూహ్యంగా మ‌ళ్లీ మ‌రో వివాదం కేసీఆర్‌ను చుట్టుకుంది. మృతుల సంఖ్య‌ను న‌మోదు చేయ‌డంలో గోప్యం పాటిస్తున్నార‌నేది తాజా వివాదం. అంటే.. మృతి చెందిన వారి వివ‌రాల‌ను చెప్ప‌డంలో కేసీఆర్ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, రాష్ట్రానికి ముఖ్యంగా హైద‌రాబాద్‌కు ఉన్న పేరు ఎక్క‌డ పాడ‌వుతుందోన‌ని భావిస్తున్న కేసీఆర్‌.. మృతుల సంఖ్య‌ను త‌గ్గించి చూపుతున్నార‌ని, రోజూ క‌నీసం ప‌దుల సంఖ్య‌లో ప్ర‌జ‌లు చ‌నిపోతుంటే కూడా 9, లేదా 10 మంది కన్నా ఎక్కువ‌గా మృతుల వివ‌రాలు చెప్ప‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. కానీ, శ్మ‌శానాల్లో ప‌రిస్థితులు దీనికి భిన్నంగా ఉంటున్నాయ‌నేది ప్ర‌ధాన విమ‌ర్శ‌. ఈ క్ర‌మంలో ఇప్పుడు మ‌రోసారి కేసీఆర్ ప్ర‌భుత్వం క‌రోనా విష‌యంలో బోనెక్కాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌నేది వాస్త‌వం. మ‌రి ఏం చేస్తారో.. ఎలా బుకాయిస్తారో చూడాలి.

Must Read

ఈ ఎస్ ఐ కుంభ కోణానికి మించిన కుంభకోణంలో అచ్చెనాయుడు..?

ఇప్పటికే ఈఎస్ఐ స్కాం లో రెండు నెలలనుంచి రేమాండ్ ఉన్న మాజీ మంత్రి, టిడిపి ఎమెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు మరో కుంభకోణంలో నూ ప్రధాన నిందితుడుగా ఉన్నాడన్న వార్తలు టిడిపి లో ఇప్పుడు...

ఏపీలో ట్యాపింగ్ రగడ : ఎవరిదీ తప్పు.. ఎవరిదీ ఒప్పు.!!

ఏపీలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన వివాదం నడుస్తోంది. ఏపీలో రాజకీయనాయకులవే కాదు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి అనే వార్తలు వస్తున్నాయి. న్యాయమూర్తుల ఫోన్లనే ట్యాప్ చేస్తున్నారంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల...

వైసీపీ కి చెక్ పెట్టడానికి బ్రహ్మాస్త్రం రెడీ చేసిన చంద్రబాబు..!!

గత కొంత కాలంగా చంద్రబాబు ఏం చెప్పినా సరే దానికి వాల్యూ లేకుండా పోతుంది. ప్రజలు కూడా ఇక చంద్రబాబు ను పట్టించుకునే పోసిషన్ లో లేరు.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఆయనది...

శంకుస్థాపన వాయిదా వెనుక జగన్ పై వత్తిడి..అయన హస్తం ఉందా..!!

ఎపి సీఎం జగన్ ఏరి కోరి తెచ్చుకున్న విశాఖ రాజధాని శంకుస్తాపన కార్యక్రమం వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.. అయితే ఎందుకు ఎలా వాయిదా పడిందన్న సంగతి మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు.....

ఎన్టీఆర్ చంద్రబాబు రేంజ్ లో పవన్ కి వెన్నుపోటు.. ఎవరంటే..!!

ఏపీ రాజకీయాల్లో జనసేన పానకంలో పుడకలా మిగిలిపోయింది అన్నవారికి పవన్ కళ్యాణ్ బిజెపి లో చేరి గట్టి షాక్ ఇచ్చాడు.. ఇక బీజేపీ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వెనుకాల పవన్ హస్తం ఉందన్న...